ఇదేందీ.. మీరు అలా ఎలా చేస్తున్నారు? : హరీశ్ రావు

by Shyam |
ఇదేందీ.. మీరు అలా ఎలా చేస్తున్నారు? : హరీశ్ రావు
X

దిశ, వెబ్ డెస్క్: అటు వైపుగా మంత్రి గారు వెళ్తున్నారు. ఆ సమయంలో వాళ్లు పనిలో నిమగ్నమయ్యారు. అయితే విషయం గమనించిన మంత్రి వెంటనే తన కాన్వాయ్ ను ఆపి.. అక్కడికి వెళ్లి విషయం తెలుసుకుకున్నాడు. ఆపై ఆ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మరోసారి సీన్ రిపీట్ కావొద్దని కొంచెం గట్టిగానే చెప్పాడు. అదేంటో మీరే చూడండి… ప్రత్యేక కథనంలో..

విషయమేమిటంటే.. రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు.. పొన్నాల నుంచి సిద్ధిపేట పట్టణానికి వెళ్తున్నారు. ఆ సమయంలో జిల్లా కేంద్రంలోని రాజీవ్ రహదారి సమీపంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు కనిపించారు. దీంతో వెంటనే తన కాన్వాయ్ ను నిలిపి మంత్రి వారి వద్దకు చేరుకున్నారు. అక్కడికి వెళ్లి… ఒకవైపు కరోనా వ్యాధి వ్యాపిస్తుంటే.. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడికి ప్రయత్నాలు చేస్తూ ప్రజలందరినీ తగు జాగ్రత్తలు తీసుకోమ్మని సూచిచూస్తుంటే.. మీరు ముఖాలకు మాస్కులు, చేతులకు గ్లౌజులు లేకుండా ఎలా పని చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో పారిశుద్ధ్య కార్మికులు అసలు విషయం మంత్రి గారికి తెలియజేశారు. దీంతో మున్సిపల్ కమిషనర్ పై, పలువురు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసి.. అనంతరం మాస్కులు, గ్లౌజులు తెప్పించి ఆ పారిశుద్ధ్య కార్మికులకు అందజేసినట్లు సమాచారం.

Tags: Minister Harish Rao, Sanitary Workers, Masks, Gloves, Distribution, Officers, Wrath, Siddipet

Advertisement

Next Story

Most Viewed