- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు వేయాలి’
by Shyam |
X
దిశ సిద్దిపేట: ప్రజాస్వామ్య పరిరక్షణకు తప్పకుండా ఓటు వేయాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు పిలుపునిచ్చారు. సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 23 వ వార్డులోని బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ లో గల 69 బూత్ నెంబర్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొవిడ్ నిబంధనలకు లోబడే ఓటింగ్ జరుగుతుందని, కరోనా ను దృష్టిలో ఉంచుకుని పోలింగ్ కేంద్రాల సంఖ్య పెంచడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఓటింగ్ శాతం ఎంత పెరిగితే ప్రజాస్వామ్యం అంత బలంగా ఉంటుందన్నారు. అభివృద్దికి పట్టం కట్టి, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మంచి అభ్యర్థులను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. నేడు సెలవు ప్రకటించినందున ఎవరూ ఇండ్లలో ఉండకుండా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.
Advertisement
Next Story