బాబూ.. కషాయం తీసుకో : హరీశ్‌రావు

by Shyam |
బాబూ.. కషాయం తీసుకో : హరీశ్‌రావు
X

దిశ, సిద్ధిపేట: సిద్ధిపేటలో మంత్రి హరీశ్ రావు కషాయాన్ని పంపిణీ చేశారు. వివరాల్లోకి వెళితే.. సిద్ధిపేట జిల్లా కేంద్రమైన సిద్ధిపేట నర్సాపూర్ సర్కిల్ లో ఏర్పాటు చేసిన కషాయం వితరణ కేంద్రాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం పలువురికి కషాయాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, ఏఏంసీ చైర్మన్ పాలసాయిరాం, సుడా డైరెక్టర్ మచ్చ వేణు గోపాల్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Next Story