- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా భుజం మీద తుపాకీ పెట్టడం విఫలయత్నం : మంత్రి హరీశ్ ఫైర్
దిశ, వెబ్‌డెస్క్ : మాజీ మంత్రి ఈటల రాజేందర్ తనపై చేసిన వ్యాఖ్యలపై ఆర్థిక మంత్రి హరీశ్ రావు స్పందించారు. ఈటల నా భుజం పై తుపాకీ పెట్టడం విఫల ప్రయత్నం అని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈటల పార్టీ వీడటానికి ఆయనకు అనేక కారణాలు ఉండొచ్చు. ఆయన పార్టీలో ఉండాలా.. వద్దా..? అనేది ఆయనిష్టం అని చెప్పారు. తాచెడ్డ కోతి వనమెల్ల చెడగొట్టినట్లు.. ఈటల వెళ్లే ముందు తనపై వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.
ఆయన పార్టీని వీడినంత మాత్రాన టీఆర్ఎస్‌కు నష్టంలేదని హరీశ్ రావు వెల్లడించారు. తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ మాట జవదాటబోనని, ఆయన పార్టీ అధ్యక్షుడే కాదు, తనకు గురువు, మార్గదర్శి, తండ్రితో సమానమని చెప్పుకొచ్చారు. ఈటల టీఆర్ఎస్‌కు చేసిన సేవ కన్నా.. పార్టీ ఆయనకు ఇచ్చిన అవకాశాలే ఎక్కువ అని అన్నారు. పదే పదే ఈటల తన పేరు ప్రస్తావించడం ఆయన భావదారిద్ర్యానికి నిదర్శనం అని మంత్రి హరీశ్ రావు విమర్శించారు.