- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్ర సాధనలో వారి పాత్ర గొప్పది
దిశ,సిద్దిపేట: తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎన్నారైల పాత్ర ఎంతో గొప్పదని, సోషల్ మీడియాలో గోబెల్ ప్రచారాలను టీఆర్ఎస్ ఎన్నారై లు తిప్పి కొట్టాలనీ ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. దుబ్బాక ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ ఎన్నారైలతో మంత్రి హరీశ్ రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంలో ఎన్నారైలు అందరూ క్రియాశీలక పాత్ర పోషించాలని కోరారు. తెలంగాణ ఉద్యమంలో ప్రపంచవ్యాప్తంగా మేధావులు అందరినీ కూడగట్టడంలో ఎన్నారైల పాత్ర ఎంతో గొప్పదని అన్నారు. వారి పాత్రను ఎప్పుడూ మరిచిపోలేమని తెలిపారు.
రాష్ట్రం ఏర్పడ్డాక, రామలింగా రెడ్డి ఎమ్మెల్యే అయ్యాక కేసీఆర్ నాయకత్వంలో ప్రతి ఇంటికీ త్రాగునీరు అందించారని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నినాదమే ప్రతి ఇంటికీ త్రాగునీరు, ప్రతి ఎకరాకు సాగు నీరనీ అన్నారు. ఇప్పటికే ప్రతి ఇంటికీ త్రాగునీరు అనే అంశం పూర్తయిందన్నారు.సాగునీరు కూడా త్వరలో పూర్తవుతుందని తెలిపారు. దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో మీ బంధువులు, మీ స్నేహితులు చిన్ననాటి మిత్రులు సుజాత గెలుపునకు సహకరించేలా అందరూ కృషి చేయాలని కోరారు.