దుబ్బాకకు వస్తవా.. కరీంనగర్ రమ్మంటవా !

by Shyam |
దుబ్బాకకు వస్తవా.. కరీంనగర్ రమ్మంటవా !
X

దిశ, వెబ్‌డెస్క్: కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌కు రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్‌రావు మరోసారి సవాల్ విసిరారు. నిధుల్లో వాటాపై చర్చకు బండి సంజయ్‌ సిద్ధమా అని ప్రశ్నించారు. దుబ్బాకకు నీవు వస్తావా.. లేకుంటే కరీంనగర్‌కు నన్ను రమ్మంటావా అని వ్యాఖ్యానించారు. డబ్బుతో రెడ్ హ్యాండె‌డ్‌గా దొరికి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, పట్టుబడ్డ వ్యక్తే బీజేపీ అభ్యర్థి డబ్బులని చెప్పారన్నారు. సమాచారం ఇస్తే అధికారులు సోదాలు చేయొద్దా అని తెలిపారు. మా వాహనాలు తనిఖీ చేస్తే సహకరించామని స్పష్టం చేశారు. 8చోట్ల సోదాలంటూ సోషల్ మీడియాలో బీజేపీ తప్పుడు ప్రచారం చేసిందని మంత్రి విమర్శించారు.

Advertisement

Next Story