- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రి హరీష్ రావు ఆపరేషన్ స్టార్ట్.. వారితో వీడియో కాన్ఫరెన్స్
దిశ,మెదక్ : ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించి వారిలో విశ్వసనీయత కలిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ విషయంలో జిల్లా స్థాయి అధికారులు మొదలుకొని కింది స్థాయి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని బీఆర్కేఆర్ భవనం నుంచి జిల్లా కలెక్టర్లు, వైద్య, ఆరోగ్య శాఖ ఆయా శాఖల అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ వైద్యశాలలు మొదలుకొని జిల్లా ఆసుపత్రుల వరకు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించి ప్రభుత్వ ఆసుపత్రులంటే వారిలో విశ్వసనీయతను కలిగించేలా కృషి చేయాలని సూచించారు. ఈ విషయంలో రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రులకు ప్రభుత్వపరంగా పూర్తి సహకారం అందిస్తామని అన్నారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఈ విషయంలో జిల్లా కలెక్టర్లతో పాటు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని, ఆస్పత్రుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రులు బాగుండాలనే కృతనిశ్చయంతో జిల్లా కలెక్టర్లు, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఎప్పటికప్పుడు ఆసుపత్రులను ఆకస్మికంగా తనిఖీలు చేసి తగిన సలహాలు, సూచనలు అందజేయాలని అప్పుడే ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రులపై పూర్తి విశ్వసనీయత కలుగుతుందని మంత్రి హరీష్ రావు తెలిపారు. దీంతో పాటు ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించడంతో పాటు ఆసుపత్రిలో వైద్య సేవలు ఎలా అందుతున్నాయి ? సిబ్బంది పనితీరుతో పాటు వసతులు ఎలా ఉన్నాయి ? అనే తదితర వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనిఅన్నారు.
అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిశుభ్రత పాటించడం ఎంతో ముఖ్యమైన విషయమని ఈ విషయంలో ఆయా ఆసుపత్రుల అధికారులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. రాబోయే రోజుల్లో తాను కూడా రాష్ట్రంలోని ఆయా ఆస్పత్రులను ఆకస్మికంగా తనిఖీ చేస్తానని, ఆసుపత్రుల్లో వసతులు, సౌకర్యాలు, సిబ్బంది, మందులతో పాటు ప్రజలకు అందుతున్న వైద్యసేవలు గురించి తెలుసుకుంటానని మంత్రి హరీష్ రావు వివరించారు. దీంతో పాటు ఆయా జిల్లాల ఆస్పత్రులకు ఆక్సిజన్ ప్లాంట్లను కేటాయించడం జరిగిందని ప్రస్తుతం వాటి పనితీరు ఎలా ఉంది ? అనే విషయాలపై ఆయా జిల్లాల కలెక్టర్లు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సమీక్ష సమావేశాలు నిర్వహించి ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే వాటిని పరిష్కరించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.