- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మేము ఓటుకు రూ.20వేలు పంచలే.. మంత్రి గంగుల కీలక కామెంట్స్
దిశ, డైనమిక్ బ్యూరో : హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఓటుకు రూ.20వేలు పంచుతున్నట్లు బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. దీనిని మంత్రి గంగుల కమలాకర్ ఖండించారు. మేము ఓటుకు రూ.20వేలు పంచినట్లు ఎలాంటి ఆధారాలు లేవని, బండి సంజయ్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని గంగుల వెల్లడించారు. ‘‘ నేను బండి సంజయ్‌కు సవాల్ విసురుతున్నా.. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్‌కు రేపు ఉదయం 10 గంటలకు తడిబట్టలతో వచ్చి ప్రమాణం చేద్దాం. ఒకవేళ మేము ఓటుకు రూ.20 వేలు ఇచ్చింది నిజమైతే అమ్మవారు మమ్మల్ని శపిస్తుంది. లేకుంటే మిమ్మల్ని శపిస్తుంది.’’ అన్నారు.
హుజురాబాద్‌లో డబ్బులు పంచాల్సిన అవసరం టీఆర్ఎస్‌కు లేదని, మేము చేసిన అభివృద్ధిని చూసి ప్రజలే మమ్మల్ని గెలిపిస్తారని గంగుల ధీమా వ్యక్తం చేశారు. ఈటలపై 30 నుంచి 40 వేల ఓట్ల మెజారిటీతో టీఆర్ఎస్ గెలవనుంది అని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా రూ.6వేలు కూడా బీజేపీ వాళ్లే టీఆర్ఎస్ కండువ వేసుకొని పంచుతున్నారని ఆరోపించారు.