కార్మికులకు అండగా ఉంటాం: మంత్రి గంగుల

by Sridhar Babu |   ( Updated:2020-04-12 02:52:35.0  )
కార్మికులకు అండగా ఉంటాం: మంత్రి గంగుల
X

దిశ, కరీంనగర్:
లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన కార్మికులను ఆదుకునేందుకు చొరవ తీసుకుంటామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలార్ అన్నారు. కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్స్ మార్కెటింగ్ కంపెనీ ఆధ్వర్యంలో వివిధ రంగాలకు చెందిన 3 వేల మంది కార్మికులకు రూ. 15 లక్షలు విలువ చేసే నిత్యావసరాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి గంగుల మాట్లాడుతూ లాక్‌డౌన్ పొడిగించిన నేపథ్యంలో ప్రజలు సహకరించాలని కోరారు. ఉపాధి కోల్పోయిన కార్మికులందరినీ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ మాట్లాడుతూ కరీంనగర్‌లో కరోనా వ్యాప్తి చెందకుండా యంత్రాంగం గొప్పగా కృషి చేస్తోందని కొనియాడారు. కరోనా నివారణకు ప్రజలు సహకరించాలని కోరారు.

Tags: coronavirus, Karimnagar, minister gangula, distribute essential goods, distribute essential goods

Advertisement

Next Story

Most Viewed