- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గత ఏడాది కంటే 30 శాతం అధికంగా ధాన్యం కొనుగోళ్లు
దిశ, తెలంగాణ బ్యూరో: ధాన్యం కొనుగోళ్లు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని, గత ఏడాది కంటే 30 శాతం అధికంగా ఈరోజు వరకు ధాన్యం సేకరణ చేశామని, వీటికి నిధుల కొరత లేదని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సోమవారం సివిల్ సప్లైస్ ఉన్నతాధికారులతో హైదరాబాద్ లోని మంత్రి కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్లలో గత సంవత్సరం ఇదే రోజు కన్నా దాదాపు 11 లక్షల మెట్రిక్ టన్నులు ఈ ఏడు అధికంగా కొనుగోలు చేశామన్నారు. ఇప్పటికే 13 జిల్లాల్లో 1280 కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తై మూసివేశామన్నారు.
5447 కోట్లను ఇప్పటికే రైతుల అకౌంట్లలో వేశామన్న మంత్రి, ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైతుల అకౌంట్లలో నిధుల్ని జమ చేస్తున్నామన్నారు. 6775 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోళ్లు చేపడుతున్నామని, నిన్నటివరకు 42.22 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామన్నారు. గన్నీల కొరత అసలు లేదన్నారు.
ఎఫ్.సీ.ఐ గోదాములు తెలంగాణలో దాదాపుగా అన్నీ నిండిపోయాయని, ముఖ్యంగా సూర్యాపేట, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నిర్మల్ జిల్లాల్లో గోదాములు పూర్తిగా నిండిపోయాయని తెలిపారు. ఎఫ్.సీ.ఐ గోదాములను, గోడౌన్లను లీజుకు తీసుకోవడానికి అంగీకరించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు.