మంత్రి గంగులకు నాంపల్లి కోర్టు గుడ్‌న్యూస్.. ఆ కేసు కొట్టివేత

by Sridhar Babu |   ( Updated:2021-09-24 07:58:43.0  )
minister gangula
X

దిశ, కరీంనగర్ సిటీ : ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులో మంత్రి గంగుల కమలాకర్‌కు ఊరట లభించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో నాటి కరీంనగర్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన మంత్రి గంగుల ఎన్నికల కోడ్ ఉల్లంగించారంటూ కేసు నమోదైంది. ఈ కేసు శుక్రవారం నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టులో హియరింగ్‌కు వచ్చింది. ఆయనతో పాటు మరికొందరిపై చేసిన అభియోగాలకు సంబంధించిన ఆధారాలు సమర్పించకపోవటంతో కేసు కొట్టివేసినట్టు గంగుల తరఫున వాదనలు వినిపించిన అడ్వొకేట్ రాజేందర్ రావు తెలిపారు.

కేసు నెంబర్ 37/20లో ఏ1గా మంత్రి గంగుల వరుసగా టీఆర్ఎస్ నాయకులు చల్లా హరిశంకర్, చంద్రశేఖర్, కర్ర సూర్యశేఖర్, బట్టు వరప్రసాద్, పెద్దిరమేష్‌లపై అభియోగాలు నమోదవ్వగా, కేసు నెంబర్ 38/20లో మంత్రి గంగుల ఏ1, ఏ2గా చల్లా హరిశంకర్‌లపై కోడ్ అమల్లో ఉండగా అధికారిక కార్యక్రమాల్లో కొబ్బరికాయ కొట్టారని ప్రభుత్వం కేసు నమోదు చేసింది. అయితే, ఈ అభియోగాలను విచారించిన నాంపల్లి ఎంఎల్ఏ, ఎంపీల కోర్టు, ప్రాసిక్యూషన్ అభియోగాలను నిరూపించలేకపోవడంతో మంత్రి గంగులతో సహా మిగతా వారందరిపై కేసులను కొట్టివేసి నిర్దోషులుగా తీర్పు వెలువరించినట్టు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో న్యాయవాది రాజేందర్ రావు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed