‘ఎన్ఆర్‌ఐలు సొంత ఊళ్ళ‌కు వెన్నుద‌న్నుగా నిల‌వాలి’

by Shyam |   ( Updated:2020-04-04 03:32:47.0  )
‘ఎన్ఆర్‌ఐలు సొంత ఊళ్ళ‌కు వెన్నుద‌న్నుగా నిల‌వాలి’
X

దిశ, వరంగల్: క‌రోనా క‌ష్టకాలంలో ముందుకు వస్తున్న దాత‌ల‌కు ధ‌న్య‌వాదాలని, ఎన్ఆర్‌ఐలు కూడా సొంత ఊళ్ళ‌కు వెన్నుద‌న్నుగా నిల‌వాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. ఉమెన్ ఎంప‌వ‌ర్‌మెంట్ తెలుగు అసోసియేష‌న్ (డబ్ల్యూవీటీఏ-యూఎస్ఏ), అనుమాండ్ల రాజేంద‌ర్ రెడ్ది, ఝాన్సీల ఆధ్వర్యంలో తొర్రూరులో వ‌ల‌స కూలీల‌కు రూ.3.5ల‌క్ష‌ల విలువైన 300 రోజుల‌కు స‌రిప‌డా బియ్యాన్ని పంపిణీ చేశారు. అనుమాండ్ల తిరుప‌తిరెడ్డి ఆధ్వ‌ర్యంలో భోజ‌న కిట్లను పంపిణీ చేశారు. అనంత‌రం మంత్రి మాట్లాడుతూ ప్ర‌పంచ‌మంతా క్లిష్ట ప‌రిస్థితులు ఎద‌ర్కొంటున్న ఈ క‌ష్ట కాలంలో సీఎం కేసీఆర్ ప్ర‌జ‌ల క్షేమాన్ని మ‌ర‌వలేద‌న్నారు. వ‌లస కూలీల‌ను సొంత బిడ్డ‌ల్లా చూసుకుంటూ మానవత్వాన్ని చాటుకున్నారని కొనియాడారు. అనంతరం తొర్రూరు ల‌య‌న్స్ క్ల‌బ్ ఆధ్వ‌ర్యంలో పారిశుధ్య కార్మికుల‌కు రూ. 20 వేల విలువైన మాస్కులు, అనాథ‌ల‌కు బియ్యాన్ని మంత్రి పంపిణీ చేశారు.

tags : Minister errabelli dayakar rao, distributing,rice, migrant workers, warangal

Advertisement

Next Story