వలస కూలీలకు అండగా ఉంటాం 

by Shyam |   ( Updated:2020-03-31 03:50:41.0  )
వలస కూలీలకు అండగా ఉంటాం 
X

దిశ, మహబూబ్‌నగర్: జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఉంటున్న వలస కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. వలస వచ్చిన వారికి కావాల్సిన అని రకాల సహాయక చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని కావున ఎవరు కూడా స్వస్థలాలకు వెల్లేందుకు ప్రయత్నించొద్దని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో నివాసముంటున్న బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, కలకత్తా రాష్ట్రాలకు చెందిన వారికి ఉచితంగా 12 కిలోల బియ్యాన్ని రూ.500 రూపాయల నగదును అందచేశారు. వలస కులీలు ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని అందుకొని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇంకా ఎక్కడైనా ఇలాంటి వారు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే వారిని ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట జిల్లా కలెక్టర్ వెంకట్రావు, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింలు, మున్సిపల్ కమిషనర్ పాల్గొన్నారు.

Tags : Minister srinivas goud, distributing, rice, migrant workers, mahaboobnagar

Advertisement

Next Story