- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చనిపోయిన ప్రతి వ్యక్తికి కరోనా పరీక్షలు అసాధ్యం
దిశ , హైదరాబాద్: క్యాన్సర్‌తో బాధపడుతున్న పేద ప్రజలకు సహాయంగా ‘‘ఆలన’’ సర్వీస్ వాహనాలు ఉపయోగకరంగా ఉంటాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. రోగులు నెలల తరబడి ఆసుపత్రుల్లో ఉండి చికిత్స చేయించుకోవాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఉండి ఉచిత వైద్య చికిత్సలు పొందవచ్చన్నారు. వైద్యం అవసరమైన సమయాల్లో వైద్యులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు రోగులను కంటికి రెప్పలా కాపాడతారని ఆయన అన్నారు. మంగళవారం కోఠిలోని డీఎంహెచ్ఎస్ ఆవరణలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ‘‘ఆలన’’ పేరుతో ప్యాలిమేటివ్ హోమ్ కేర్ సర్వీస్ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇటీవల న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ప్రకారం మరణించిన ప్రతి ఒక్కరికి కోవిడ్ పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదన్నారు. గాంధీ ఆస్పత్రిలో రోగులకు అందుతున్న చికిత్సలపై తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దన్నారు. కార్యక్రమంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ యోగితా రాణా, డీఎంఈ డాక్టర్ రమేష్ రెడ్డి, డీహెచ్ డాక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.