93ఏళ్ల మహిళ కరోనాను జయిస్తే..ఇంట్లో వాళ్లు రావొద్దన్నారు

by vinod kumar |
93ఏళ్ల మహిళ కరోనాను జయిస్తే..ఇంట్లో వాళ్లు రావొద్దన్నారు
X

దిశ, వెబ్‌డెస్క్: గాంధీ ఆస్పత్రిలో 93ఏళ్ల మహిళ ఎట్టకేలకు కరోనా వైరస్‌తో పోరాడి గెలిచింది. కానీ, ఏం లాభం ఆమె కుటుంబ సభ్యులు మాత్రం ఇంటికి రావొద్దని, కొన్ని రోజులు గాంధీ ఆస్పత్రిలోనే ఉండాలని చెప్పారు. ఈ విషయం కాస్త వైద్య ఆరోగ్య మంత్రి ఈటల దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించారు. ప్రస్తుతం ఈలాంటి ఘటనలు అనేకం జరుగుతున్నాయి. వైరస్ బారిన పడి డిశ్చార్జి అయిన వారి పట్ల వివక్ష చూపించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈటల స్పష్టంచేశారు.ఇకమీదట ఎవరైనా హోంక్వారంటైన్ లో ఉండేందుకు ఇష్టపడనివారిని నేచర్ క్యూర్ ఆస్పత్రికి తరలిస్తామని మంత్రి వివరించారు.అంతేకాకుండా కుటుంబసభ్యులు నిరాకరించిన వృద్ధురాలికి కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయనున్నట్టు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed