- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈటల మాటల వెనక మర్మమేమిటో? అధినేతతో దూరం పెరిగిందా?
దిశ ప్రతినిధి, కరీంనగర్: మంత్రి ఈటల రాజేందర్ చేస్తున్న వ్యాఖ్యల దుమారంపై టీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా చర్చ సాగుతున్నట్లు తెలుస్తోంది. ఉన్నట్టుండి ప్రభుత్వ తప్పిదాలను బహిరంగంగా ఎత్తి చూపుతున్నారెందుకో అంతుచిక్కకుండా తయారైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఆయన ప్రభుత్వం చేపట్టిన పథకాల్లోని లోపాలను డైరెక్ట్ గా సీఎం దృష్టికే తీసుకెళ్లొచ్చుగా అంటున్నారు కొందరు. సీఎంకు చెప్పకుండా ఓపెన్‌గా మాట్లాడడం వెనక ఆంతర్యం ఏమైనా ఉందా అని పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రివర్గంలో ఈటల స్థానం ఉండదన్న చర్చ బాహాటంగా సాగింది. అప్పుడు కూడా చాలా రోజుల పాటు నియోజకవర్గంలోనే ఉండిపోయారు. ఉన్నట్టుండి ఓ బహిరంగ సభ వేదికగా మాటల తూటాలు పేల్చారు. ఇప్పుడు కూడా హుజురాబాద్ లోనే ఉంటున్న మంత్రి ప్రభుత్వ వైఫల్యాలను బహిరంగంగా ఒప్పుకుంటున్నారు. అయితే అప్పుడు సభా వేదికపై ఓ నాయకుడు చీటి పంపించడంతో మాట్లాడిన ఆయన ఇప్పుడు రైతుల అభిప్రాయంగా రైతుబంధు గురించి చెప్పారు.
అధినేతతో దూరం పెరిగిందా?
ఆయనిలా మాట్లాడడం వెనక అధినేత కుటుంబానికి ఆయనకు మధ్య ఏమైనా దూరం పెరిగిందా అన్న చర్చ కూడా సాగుతోంది. కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే ఆ కేబినెట్‌లో ఈటల బెర్త్ కనఫం కాకపోవడం వల్లే ఇలా మాట్లాడుతున్నారా అని అంటున్న వారూ లేకపోలేదు. కేటీఆర్ సీఎంగా బాధ్యతలు తీసుకుంటే డిప్యూటీ సీఎం ఇవ్వాలన్న ప్రతిపాదన ఉంచడంతో అందుకు సానుకూల స్పందన రాకపోవడం వల్లే ఆయన మళ్లీ తన నియోజకవర్గాన్ని వేదికగా ఎంచుకుని అస్త్రాలను సంధిస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రేపు సారు డిప్యూటీ సీఎం అయితే నియోజకవర్గ ప్రజలతో ఇంతగా టచ్ లో ఉండే అవకాశం లేదని అందుకే ఇప్పుడే అన్ని మండలాలను తిరుగుతున్నారని ఆయన సన్నిహితులు అంటున్నారు. కానీ ఆయన చేస్తున్న ప్రకటనలు దేనికి సంకేతమో అంతుచిక్కకుండా తయారైందనే చెప్పాలి.
బీజేపీయే కారణమా..?
ఇటీవల కాలంలో బీజేపీ బలం పుంజుకుంటోందని విశ్లేషకులు చెప్తున్నారు. హుజురాబాద్ లో కూడా యూత్ కమలం వైపు ఆకర్షితులు అవుతున్నారని గుర్తించిన మంత్రి కౌంటర్ గా ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారని చెప్తున్నారు. బీజేపీ గురించి బాహాటంగా మాట్లాడకుండా జాగ్రత్త పడుతున్న ఆయన రైతులను అక్కున చేర్చుకునే ప్రయత్నంలో భాగంగానే రైతు వేదికల ప్రారంభోత్సవాలను ఆసరా చేసుకుంటున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఈ విషయంపై తన అత్యంత సన్నిహితులైన అనుచరులతో ప్రణాళికలు వేసుకున్న మంత్రి ప్రతి రైతు వేదిక ప్రారంభోత్సవానికి వెయ్యి మంది రైతులు తప్పకుండా హాజరు అయ్యేలా చొరవ చూపాలని సూచించినట్లు తెలుస్తోంది.