వైద్యారోగ్య అధికారులతో ఈటల వీడియో కాన్ఫరెన్స్‌

by Shyam |
వైద్యారోగ్య అధికారులతో ఈటల వీడియో కాన్ఫరెన్స్‌
X

హైదరాబాద్: లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో తెలంగాణలో కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసే వ్యూహాలపై వైద్యారోగ్య అధికారులతో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వీడియో కాన్ఫరెన్స్‌లో సమావేశమయ్యారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కరోనా లక్షణాలున్న వారికి పరీక్షలు, మిగిలిన అత్యవసర సేవలు అందించడం, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి 14 రోజుల క్వారంటైన్, కేంద్రం జారీ చేసిన నూతన మార్గదర్శకాలు సహా పలు అంశాలపై 33 జిల్లాల వైద్యారోగ్య అధికారులతో ఆయన చర్చించారు. ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రెటరీ శాంతి కుమారి, కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ యోగితా రాణా, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమేష్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ శ్రీనివాసరావు, టీఎస్‌ఎంఐడీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Next Story