- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పీహెచ్సీల్లో ఓపీ సేవల సమయం పెంపు : ఈటల
X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత, ఆస్పత్రుల పనితీరుపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గురువారం సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా పీహెచ్సీల్లో ఓపీ సేవల సమయాన్ని మధ్యాహ్నం 12గంటల నుంచి సాయంత్రం 4గంటలకు పొడిగించినట్లు పేర్కొన్నారు. అలాగే జీహెచ్‌ఎంసీ పరిధిలో ఈవెనింగ్ క్లినిక్‌లు మొదలు పెట్టనున్నట్లు నిర్ణయించారు.
ఇకమీదట సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 7గంటల వరకు బస్తీవాసులకు వైద్యులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అదే విధంగా అన్ని బ్లడ్ బ్యాంకుల్లో రక్తం కొరత లేకుండా చూడాలని మంత్రి ఈటల సూచించారు. గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున.. సీజనల్ వ్యాధులు నివారించేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు.
Advertisement
Next Story