- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నవజాత శిశు మరణాల రేటు తగ్గింది: ఈటల
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కేసీఆర్ కిట్‌పథకం ప్రారంభం తర్వాత నవజాత శిశుమరణాల రేటు 25శాతం నుండి 16.8 శాతానికి తగ్గిందని సోమవారం అసెంబ్లీలో వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. గర్భిణులకు అన్ని దశల్లో ప్రభుత్వం అండగా ఉండి తల్లీబిడ్డల ఆరోగ్య పరిరక్షణ కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ కిట్ పథకం ప్రారంభించామని చెప్పారు. గర్భిణులు పనిలోకి వెళ్లకుండా ఆర్థిక తోడ్పాటును అందించేందుకు జీవన భృతిని ఈ పథకం ద్వారా కల్పిస్తున్నామన్నారు. ప్రసవం తరువాత 102 వాహనం ద్వారా ఇంటికి క్షేమంగా చేరుస్తున్నామని వివరించారు. ప్రభుత్వాస్పత్రుల్లో ఇప్పటి వరకు రూ.28.46 కోట్లతో 305 ప్రసవ గదులను ఆధునీకరించామని చెప్పారు. రూ.407 కోట్లతో 22 కొత్త మాతాశిశు సంరక్షణ కేంద్రాలు మంజూరు చేసి వీటిలో తొమ్మిది ప్రారంభించామని చెప్పారు.
ఈ కేంద్రాల్లో 1,350 పడకలు ఏర్పాటుతోపాటు, ఇతర సౌకర్యాలు, అన్ని రకాల సిబ్బందిని నియమించి మెరుగైన సేవలు అందిస్తున్నామన్నారు. బాలింతలకు రూ.2,267 రూపాయల విలువగల 15 వస్తువులతో కూడిన కేసీఆర్ కిట్‌తో పాటు విడతలవారీగా మిగతా డబ్బులు అందజేస్తున్నామని వివరించారు. ప్రభుత్వాస్పత్రుల్లో 10,47,323 మంది పురుడు పోసుకోగా, 8,65,383 మందికి కేసీఆర్ కిట్లను పంపిణీ చేశామన్నారు. గర్భిణులకు వివిధ దశలలో రూ.990.26 కోట్లను ఈ పథకం ద్వారా అందించామన్నారు. ఆదిమ ఆదివాసీల కోసం మానవీయ కోణంలో ఆలోచించి ప్రత్యేకంగా నిబంధనలు సడలించి రెండు కన్నా ఎక్కువ ప్రసవాలకు కూడా కేసీఆర్ కిట్ పథకాన్ని అందించడం జరిగిందన్నారు.
దేశంలోని సగటున సహజ ప్రసవాలు పెరిగి సిజేరియన్ ప్రసవాలు 35శాతం వరకు తగ్గాయని ప్రకటించారు. సంపూర్ణ వాక్సినేషన్‌లు 68 శాతం నుండి 96 శాతం పెరిగిందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రత్యేక శ్రద్ధ వలన శిశు మరణాల రేటు 39 శాతం నుంచి 26.4శాతానికి తగ్గిందన్నారు. ఐదేళ్ల లోపు పిల్లలో జరిగే మరణాల రేటు 41 శాతం నుండి 19.4 శాతానికి తగ్గిందన్నారు. మెటర్నల్ మోర్టలిటీ రేట్ ఎంఎంఆర్ ప్రతి లక్ష ప్రసవాల్లో 92 శాతం నుంచి 63శాతానికి తగ్గిందన్నారు. దేశంలోనే అత్యధికంగా ఎంఎంఆర్ తగ్గిన రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని మంత్రి వివరించారు.