- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉంది: ఈటల
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు అదుపులోనే ఉన్నాయని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. పక్క రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోమవారం సచివాలయంలో చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్, హెల్త్ సెక్రెటరీ రిజ్వీలతో సమావేశం నిర్వహించారు. కేసులు పెరిగితే వైద్య సేవలు అందించేందుకు అన్ని ఆసుపత్రులను సిద్ధంగా ఉంచాలని సూచించారు.
టిమ్స్ హాస్పిటల్ పూర్తి స్థాయిలో, గాంధీ హాస్పిటల్ కొవిడ్ వార్డుల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. పీపీఈ కిట్స్‌ను, ఎన్95 మాస్క్‌లను, మందులను, రెమ్‌డెసివర్ ఇంజక్షన్లు, యాంటీ వైరల్ టాబ్లెట్లు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచాలని వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీని ఆదేశించారు. రాష్ట్రంలో ఆర్టీపీసీఆర్ టెస్టులు ఎక్కువగా చేయాలని సూచించారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రజల సంపూర్ణ భాగస్వామ్యంతోనే కరోనా కట్టడి సాధ్యమన్నారు. కరోనా పట్ల నిర్లక్షంగా వ్యవహరించొద్దని హెచ్చరించారు. తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, చేతులు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని కోరారు. ముందస్తు ఏర్పాట్లు, టెస్టింగ్.. ట్రేసింగ్.. ట్రీటింగ్ విధానం, పలు కీలక అంశాలపై సోమేశ్ కుమార్‌తో మంత్రి చర్చించారు.