ప్రైవేట్ ఆస్పత్రుల ప్రతినిధులతో ఈటెల భేటీ

by sudharani |
ప్రైవేట్ ఆస్పత్రుల ప్రతినిధులతో ఈటెల భేటీ
X

కోవిడ్-19 వ్యాప్తి పట్ల అప్రమత్తమైన ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇప్పటికే గాంధీ, ఫీవర్ హాస్పిటల్, చెస్ట్ హాస్పిటల్, వికారాబాద్ హాస్పిటల్, మిలిటరీ హాస్పిటల్ ప్రభుత్వపరంగా సిద్ధం చేసిన వైద్య ఆరోగ్య శాఖ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో కూడా ఒక్కో మెడికల్ కాలేజీలో 50 బెడ్స్‌ను కరోనా రోగుల కోసం సిద్ధం చేసింది.

వీటితోపాటు ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స అందించేందుకు కేంద్ర ప్రభుత్వంతో చర్చించి అనుమతి తీసుకుంది. అయితే ప్రైవేట్ హాస్పిటల్స్‌కు ప్రత్యేక గైడ్లైన్స్‌ను రూపొందించి ఇస్తామని చెప్పింది. విదేశాల నుంచి వచ్చినవారు లేదా కరోనా పాజిటివ్ వచ్చిన వారితో కలిసినప్పుడు వైరస్ లక్షణాలు ఉన్న వారిని మాత్రమే కరోనా అనుమానితులు గా గుర్తించి, వారి డాటాను కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు సమాచారం అందించి.. టెస్టుల కోసం శాంపిల్స్‌ను గాంధీ హాస్పిటల్‌కి పంపించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఈరోజు జరిగిన సమీక్ష సమావేశంలో ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రతినిధులకు స్పష్టం చేశారు. కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు చికిత్స అందించడానికి అయ్యే ట్రీట్మెంట్ చార్జీలను కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తుందని మంత్రి తెలిపారు. దీనికి హాస్పిటల్స్ అంగీకరించాయి.

tag; minister, etela, meeting, private hospital officials

Advertisement

Next Story