- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘ధిక్కార స్వరమే’ బెడిసి కొట్టిందా..?
దిశ, తెలంగాణ బ్యూరో : “ మంత్రి పదవి అడుక్కుంటే వచ్చింది కాదు… పార్టీలోకి నేను మధ్యలో వచ్చినోన్ని కాదు.. బతికొచ్చినోన్ని అసలే కాదు… మేం గులాబీ జెండా ఓనర్లం… పదవులు అడుక్కొనే వాళ్లం కాదు… అధికారం శాశ్వతం కాదు… ధర్మం, న్యాయం మాత్రమే శాశ్వతం… దొంగలెవరో, దొరలెవరో త్వరలోనే తేలుతుంది… ” 2019, అక్టోబర్ 29న మంత్రి ఈటల రాజేందర్ చేసిన ఘాటు వ్యాఖ్యలివి. అప్పటి నుంచి పలుమార్లు ఇలాంటి వ్యాఖ్యాలు వస్తూనే ఉన్నాయి. మళ్లీ చల్లారుతూనే ఉన్నాయి. కానీ అవే ఘాటు వ్యాఖ్యలు ఈటలకు బల్లెమవుతోంది.
తెలంగాణ ఉద్యమంలో తూటాల్లాంటి మాటలతో అగ్గిరాజేసిన ఈటెల రాజేందర్ ఇప్పుడు స్వపక్షంలో విపక్షంగా మారారు. గులాబీదళంలో పరోక్షంగా ధిక్కారస్వరం వినిపిస్తున్నారు. అయితే అగ్నిపర్వతం బద్దలైనట్టుగా ఎంత వేగంగా బద్దలయ్యారో అంతే వేగంగా చల్లబడుతున్నారు. తన ప్రసంగం, మీడియాలో ఒక్కసారిగా సంచలనం కావడం, ఆ వెంటనే ఈటెల మరో ప్రకటన చేయడం చకచకా జరిగిపోతున్నాయి. ఈటల మాటల్లో అంతర్యమేమిటనేది రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పటికీ హాట్ టాపిక్‌గానే మారుతున్నాయి. ఇలాంటి సమయంలో మంత్రి ఈటల రాజేందర్ ధిక్కార స్వరానికి ఫలితాలను చవి చూస్తున్నారా… అనే చర్చ మొదలైంది. ఎందుకంటే రాష్ట్రంలో అన్ని ఎన్నికలు పూర్తియిన వెంటనే వ్యూహాత్మకంగా ఈటల భూ వివాదాన్ని తెరపైకి తీసుకువచ్చారు. దాదాపుగా నాలుగున్నరేండ్ల కిందట ఉన్న భూ వ్యవహారాన్ని ఇప్పుడు హీటెక్కించారు. అక్కడో… ఇక్కడో కాదు… అధికార పార్టీ అధికారిక ఛానెల్ కాకుండా అనుకూల మీడియాలో మొత్తం మంత్రి భూ వ్యవహారంపైనే కథనాలు ప్రసారం చేశారు. ఈ పరిణామాల్లో ఒక దశలో ఈటలకు కేబినెట్ నుంచి ఉద్వాసన పలుకుతున్నారనే సంకేతాలు వెళ్లాయి.
ఇప్పుడే ఎందుకీ రచ్చ..
మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట శివారులో మంత్రి ఈటల రాజేందర్ కొనుగోలు చేసిన భూములపై ఇప్పుడు విమర్శలు మొదలయ్యాయి. ఈ భూములపై మంత్రి సమగ్రంగా వివరణ ఇచ్చుకున్నారు. అయితే దీన్ని రెగ్యులర్ చేసుకునేందుకు అప్పుడు మెదక్ జిల్లా కలెక్టర్‌గా ఉన్న ధర్మారెడ్డిపై ఒత్తిడి తీసుకువచ్చారనేది మరో ఆరోపణ. ఎట్టకేలకు ఈ వివాదం గతం. తాజాగా దీని చుట్టుపక్కలే మరో ఆరేడు ఎకరాల భూమిని కొనుగోలు చేసిన మంత్రి ఈటల… దానికి రోడ్డు కోసం కొంతమంది రైతుల భూముల్లో నుంచి దాదాపు 30 ఫీట్ల రోడ్డును నిర్మించాడని పుర పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే అధికార పార్టీ అనుకూల మీడియా కొత్త కథ తెరపైకి తెచ్చింది. అక్కడి రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఫిర్యాదులు చేశారని, ఈ రెండు రోజుల నుంచి బాధిత రైతులతో మంత్రి చర్చలు పెట్టారంటూ కథనాలు నడిపించాయి. కానీ ఇందులో వాస్తవం ఎంత అనేది మాత్రం ఆ తర్వాత ఎక్కడా చూపించలేకపోయారు.
టార్గెట్ చేయమా..?
మంత్రి ఈటల రాజేందర్ ఇటీవల పలు అంశాలపై పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నర్మగర్భంగా మాట్లాడటంపై రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకే దారి తీశాయి. గులాబీ జెండా ఓనర్లం అంటూ చేసినప్పటి నుంచి పలు సందర్భాల్లో ఈటల మాట్లాడిన ప్రతి మాట రాజకీయ వర్గాల్లో హీట్ పెంచింది. ఇటీవల ఏకంగా భద్రతా సిబ్బంది కళ్లుగప్పి రెండుసార్లు ఒంటరిగా… సొంత వాహనంలో డ్రైవర్ ను తీసుకుని రహస్య ప్రాంతానికి వెళ్లి వచ్చాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎక్కడకు వెళ్లారు… ఎందుకు వెళ్లాడు అనేది ఇప్పటికీ మిస్సింగే. కొంతమందితో కలిసి కొత్త పార్టీ పెడుతున్నారని, కొంతమంది ప్రతిపక్ష నేతలతో కలిసి రాజకీయ వ్యూహాలు చేస్తున్నాడని, పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్నాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇలాంటి సమయంలో భూ వ్యవహారం ఇప్పుడు తెరపైకి తీసుకురావడం, దాన్ని అధికార పార్టీ అనుకూల మీడియాలో ప్రాధాన్యత ఇస్తూ పెద్ద ఎత్తున టెలికాస్ట్ చేయడంతో ఈటలకు ఉద్వాసన పలుకనున్నారనే చర్చ జరిగింది. దీనిపై పలుచోట్ల ఈటల వర్గీయులు రోడ్డెక్కారు. టీఆర్ఎస్ పార్టీ అధికారిక ఛానల్‌గా గుర్తింపు ఉన్న టీ న్యూస్‌లో కూడా ఆరోగ్య శాఖ మంత్రి కబ్జారోగం అంటూ ఇదే అంశాన్ని హైలెట్ చేసింది. అటు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించే పలు ఛానళ్లలో కూడా ఈ వార్త పదేపదే రావడం సంచలనంగా మారింది. దీంతో ఈటలను కావాలనే టార్గెట్ చేస్తున్నట్లుగా రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.