- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రాజయ్య, వంగపండు మృతి పట్ల ఎర్రబెల్లి సంతాపం
దిశ ప్రతినిధి, వరంగల్: భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య, ప్రముఖ వాగ్గేయకారుడు, ప్రజా గాయకుడు వంగపండు ప్రసాద రావు మృతి పట్ల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. రాజయ్య చనిపోవడం అత్యంత బాధాకరమన్నారు. సున్నం రాజయ్య నిజాయితీ, నిబద్ధత గల నాయకుడని, ఆజన్మాంతం కమ్యూనిస్టు సిద్ధాంతాలను నమ్ముకుని ఆచరించిన ఆదర్శ నేతగా కొనియాడారు. అసెంబ్లీకి ఆటోలో వచ్చిన నిరాడంబరుడు, ప్రజా సమస్యలకు ఆచరణాత్మక పరిష్కారాలు చూపిన నాయకుడన్నారు.
ఏం పిల్లడో ఎల్దామొస్తవా…. అంటూ ప్రజలను చైతన్య పరిచిన ప్రజల పాట వంగపండు ప్రజా ఉద్యమాల నిర్మాణంలో కీలకంగా పని చేశారని అన్నారు. ఉత్తరాంధ్రకు చెందిన వాడైనా, తెలంగాణకు మద్దతు పలికిన వ్యక్తి అని కొనియాడారు. ఇరువురి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబానికి సానుభూతి తెలియచేస్తూ, మనో ధైర్యం ఇవ్వాలని మంత్రి కోరుకుంటున్నట్లు తెలిపారు.