ఇది అద్భుత ఆలోచ‌న‌లోంచి పుట్టింది: మంత్రి ఎర్రబెల్లి

by Shyam |
ఇది అద్భుత ఆలోచ‌న‌లోంచి పుట్టింది: మంత్రి ఎర్రబెల్లి
X

దిశ ప్రతినిధి, వరంగల్: తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆద‌ర్శంగా నిలుస్తోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆరో విడ‌త తెలంగాణ‌కు హ‌రిత హారం కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయన వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లా ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గం గీసుకొండ మండ‌లం మ‌రియపురం క్రాస్ రోడ్డు నుండి చల‌ప‌ర్తి గ్రామం వ‌ర‌కు 14 కిలో మీటర్ల మేర మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. ‌ఇందులో భాగంగా ప‌ర‌కాల, నర్సంపేట ఎమ్మెల్యేలు చ‌ల్లా ధ‌ర్మారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డితో మంత్రి మొక్క‌లు నాటారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అద్భుత ఆలోచ‌న‌లోంచి పుట్టిందే ఈ హ‌రిత హారం అని కొనియాడారు. గ‌త ఐదు విడ‌త‌ల‌కు భిన్నంగా ఈ విడ‌త తెలంగాణ‌కు హ‌రిత హారంను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

నూటికి నూరు శాతం మొక్క‌లు మ‌నుగ‌డ సాధించేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నట్లు చెప్పారు. గ‌తంలో 85 శాతం మాత్ర‌మే మొక్క‌లు బ‌తికే వీలుండేదని, ఇప్పుడు పంచాయ‌తీరాజ్ చ‌ట్టాన్ని, హ‌రిత హారాన్ని ప‌క‌డ్బందీగా అమ‌లు చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. మొక్క‌ల‌ను మ‌నుగ‌డ సాధించేలా చూసే బాధ్య‌త అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులదేననీ, నిర్ల‌క్ష్యం వ‌హించే వారిపై చ‌ర్య‌లు త‌ప్ప‌వని మంత్రి హెచ్చరించారు. గ్రామ పంచాయ‌తీ, నరేగా నిధుల‌ు మొక్క‌ల సంర‌క్ష‌ణ‌కు వాడుకోవ‌చ్చన్నారు. మంకీ ఫుడ్ కోర్టుల ద్వారా కోతుల‌ను అదుపులోకి తెస్తామన్నారు. చెరువుగ‌ట్లు, ఎస్సారెస్పీ కాలువ‌లు, ప్ర‌భుత్వ ఖాళీ స్థ‌లాలు, చెరువు శిఖాలు అన్నింటిలోనూ హ‌రిత హారాన్ని నిర్వ‌హించ‌వ‌చ్చన్నారు. రైతుల ద్వారా మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మాన్ని మ‌రింత‌గా ప్రోత్స‌హించాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed