ఫ్లాష్.. ఫ్లాష్.. మరో వివాదంలో మంత్రి ఎర్రబెల్లి.. మహిళా ఎంపీపీని పోలీసులతో..

by Anukaran |   ( Updated:2023-10-10 15:46:32.0  )
minister errabelli
X

దిశ ప్రతినిధి, వరంగల్ / కమలాపూర్: వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకరరావు స్వయం సహాయక సంఘం సభ్యులకు వడ్డీలేని రుణాలు, బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి రుణాల చెక్కుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రొటో కాల్ వివాదం తలెత్తింది. స్థానిక కమలాపూర్ మహిళా ఎంపీపీ కార్యక్రమానికి ఆలస్యంగా హాజరు కాగా స్టేజీ పైకి ఆహ్వానించేందుకు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు నిరాకరించారు.

అయితే మధ్యలో ఆమె కలుగజేసుకుని శనిగరం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో తనపై అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నాడని, చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరే ప్రయత్నం చేస్తుండగానే ఆమెను అక్కడి నుంచి పోలీసుల సాయంతో పంపించేశారు. అనంతరం ఎంపీపీ బీజేపీ కార్యకర్తలతో కలసి రాస్తారోకో నిర్వహించారు. మహిళలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ఎంపీపీ, బీజేపీ నేతలు నిలదీశారు.

Advertisement

Next Story

Most Viewed