సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం.. హర్షం వ్యక్తం చేసిన మంత్రి ఎర్రబెల్లి

by Shyam |
సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం.. హర్షం వ్యక్తం చేసిన మంత్రి ఎర్రబెల్లి
X

దిశ ప్రతినిధి, వరంగ‌ల్: రాష్ట్రంలోని 19 జిల్లా కేంద్రాల్లో ఈనెల‌ 7వ తేదీన 19 డయాగ్నోస్టిక్ కేంద్రాలు ఏర్పాటు చేసేలా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోవ‌డంపై మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్‌రావు హ‌ర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ, ములుగు, మహబూబాబాద్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుప్రతులలో డయాగ్నోస్టిక్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించినందుకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో విప్లవాత్మకమైన మార్పులకు కేసీఆర్ శ్రీకారం చుట్టారని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అన్ని రకాల వైద్య సేవలు మరింత అందుబాటులోకి తీసుకు రావడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి తెలిపారు. కరోనా వంటి వ్యాధుల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రభుత్వం మౌలిక వసతులు మెరుగుపడ్డాయని అయన తెలిపారు.

Advertisement

Next Story