‘అనుభ‌వ‌జ్ఞులు జానారెడ్డికి ఇంతకంటే ఏం చెప్పలేం’

by Shyam |
errabelli dayakar rao
X

దిశ, హాలియా: హాలియా మున్సిపాలిటీలోని అనుముల‌కు మిష‌న్ భ‌గీర‌థ ద్వారా 100శాతం నీళ్లు స‌ర‌ఫ‌రా అవుతున్నాయని, దీనిపై అనసవర రాద్ధాంతం చేయొద్దని గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. ఊరిలో జానారెడ్డి ఇల్లు ఉందా? అమ్ముకున్నారా? అనేది వారికి సంబంధించిన విష‌య‌మ‌ని, గ్రామంలో మంచినీరు స‌ర‌ఫ‌రా జ‌రుగుతున్నదా? లేదా అన్నదే ప్రభుత్వ ల‌క్ష్యమ‌న్నారు. రెండు రోజుల కిందట ప్రధాన ర‌హ‌దారి వ‌ద్ద జ‌రుగుతున్న మ‌ర‌మ్మతు ప‌నుల కార‌ణంగా మిష‌న్ భ‌గీర‌థ‌ నీటి స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం ఏర్పడినది వాస్తవమేన‌న్నారు. కానీ వెంటనే అధికారులు ఆ స‌మ‌స్యను ప‌రిష్కరించాలని తెలిపారు. ఇదే విష‌యాన్ని హాలియా మున్సిపాల్టీ చైర్ ప‌ర్సన్ వెంపటి పార్వత‌మ్మ త‌మ లాగ్ షీట్‌లో లిఖిత పూర్వకంగా పేర్కొన్నార‌ని మంత్రి వివరించారు. నీటి స‌ర‌ఫ‌రాలో మరమ్మతుల కారణంగా కొంత అంత‌రాయం కలగడం సాధార‌ణ‌మేన‌ని, అలాగ‌ని ప్రతీ విష‌యాన్ని రాద్ధాంతం చేయాల్సిన ప‌ని లేదన్నారు. సీనియ‌ర్ నాయ‌కులు, అనుభ‌వ‌జ్ఞులైన జానారెడ్డికి ఇంత‌కంటే చెప్పాల్సిందేమీలేద‌న్నారు.

Advertisement

Next Story