- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాణ్యతగా పూర్తి చేయండి.. అధికారులకు మంత్రి ఎర్రబెల్లి ఆదేశం
దిశ, పాలకుర్తి: పర్యాటక కారిడారు పనులను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. పాలకుర్తి మండలంలోని బమ్మెర, వల్మిడి గ్రామాల్లో జరుగుతోన్న పర్యాటక అభివృద్ధి పనులను మంత్రి దయాకర్ రావు శుక్రవారం పరిశీలించారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో ఆలయ అభివృద్ధి పనుల ప్రగతిపై అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పాలకుర్తిలో సోమేశ్వర స్మారక స్థూపం, భవనం, కల్యాణ మండపం, గిరి ప్రదక్షిణ, బమ్మెరలో అక్షరాభ్యాస మందిరం, కల్యాణ మండపం, వల్మిడిలో ప్రధాన ఆలయం, వడుడికరణ, పాకశాల, రోడ్డు పనులను నాణ్యతగా పూర్తి చేయాలని అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలకుర్తి పర్యటనలో వల్మిడి, బమ్మెర గ్రామాలను సందర్శించి రూ.10 కోట్లు మంజూరు చేశారని గుర్తుచేశారు. పనుల్లో నిర్లక్ష్యం వహించకుండా నాణ్యతతో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షలో జిల్లా ఫ్లోర్ లీడర్ శ్రీనివాస్ రావు, ఎంపీపీ నాగిరెడ్డి, జిల్లా కోఆప్షన్ మదారు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జిల్లా కలెక్టర్ శివలింగయ్య, అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.