- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇలాంటి ఆణిముత్యాలు ఉన్నందుకు గర్వంగా ఉంది..
దిశ ప్రతినిధి, వరంగల్: ఆదిలాబాద్ జిల్లా మిషన్ భగీరథలో ఏఈగా పనిచేస్తున్న సంకీర్త్‌కు మంగళవారం విడుదలైన సివిల్స్ ఫలితాల్లో ఉత్తమ ర్యాంక్ రావడంతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫోన్ చేసి అభినందించారు. దేశంలో 330వ ర్యాంక్ సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలోనే ఆదర్శ పథకంగా ఉన్న మిషన్ భగీరథలో సంకీర్త్ లాంటి ఆణిముత్యాలు ఉన్నందుకు గర్వంగా ఉందన్నారు.
సివిల్స్ లాంటి ఉన్నత ప్రమాణాలు గల పరీక్షలో ఉత్తమ ఫలితం సాధించడం సామాన్యం విషయం కాదని కొనియాడారు. ఉద్యోగం చేస్తూనే, అత్యున్నత ఉద్యోగాన్ని సంపాదించడం సంకీర్త్ ప్రతిభకు నిదర్శనమన్నారు. తెలంగాణలో, ప్రభుత్వ ఉద్యోగుల్లో ప్రతిభావంతులకు కొదవలేదనడానికి అనడానికి సంకీర్త్ ఆదర్శంగా నిలుస్తారన్నారు. ఆదిలాబాద్ లాంటి వెనుబడిన జిల్లా నుంచి వచ్చిన సంకీర్త్ అందరికీ అండగా ఉండి, ప్రజలకు సేవ చేసి, ఉద్యోగంలో మంచి పేరు తెచ్చుకోవాలని మంత్రి ఆకాంక్షించారు.