వరంగల్ లో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించేది.. ఇగో ఇక్కడేనంటా?

by Sridhar Babu |   ( Updated:2021-10-30 08:49:30.0  )
Errabelli1
X

దిశ, కాజీపేట్: నవంబర్ 15న వరంగల్ లో విజయ గర్జన సభ నిర్వహించేందుకు టీఆర్ఎస్ పార్టీ భారీ సన్నాహాలు చేస్తున్నది. హన్మకొండ జిల్లా కాజీపేట మండలం రాంపూర్ గ్రామంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ లు శనివారం సభా స్థలిని పరిశీలించారు. ఇందులో భాగంగా ఇప్పటికే న‌గ‌రంలోని మడికొండ, ఉనికిచర్ల, ఉర్సు రంగలీలా మైదానం సమీపంలోని పలు ప్రాంతాలను పరిశీలించారు. అక్కడి రైతులతోనూ వారు మాట్లాడారు.

కాగా, టీఆర్ఎస్ విజ‌య గ‌ర్జన స‌భ‌ను 10 లక్షల మందితో విజ‌య‌వంతం చేయ‌డానికి, ఎలాంటి ఆటంకాలు క‌లుగ‌కుండా అన్ని హంగులతో సభను నిర్వహించేందుకు అనువైన‌ స్థలాన్ని ప‌రిశీలిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించి 20 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా పార్టీ సాధించిన విజయాలను, ప్రభుత్వం సాధించిన ప్రగతిని ముఖ్యమంత్రి కేసీఆర్.. పార్టీ శ్రేణులు, ప్రజలకు నివేదిస్తారని మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్‌రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాజీపేట తహశీల్దార్ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed