- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కేంద్రానికి దమ్ముంటే ఆ పని చేయాలి: మంత్రి ఎర్రబెల్లి
దిశ, వరంగల్: కేంద్ర ప్రభుత్వం అంబానీ అదానీల కోసమే రైతు వ్యతిరేక చట్టాలను తీసుకోచ్చిందని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఆరోపించారు. హన్మకొండ జిల్లా కేంద్రంలోని రాంనగర్‌లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కోనుగోలు చేస్తామని హామీ ఇచ్చే వరకు వదిలేది లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను బుక్‌లెట్ రూపంలో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన పంటలపై కేంద్రం వివక్ష, కక్షసాధింపు చర్యలకు పూనుకుందని అన్నారు.
కేంద్ర ప్రభుత్వనికి దమ్ముంటే రైతు వ్యవసాయ బావుల కాడ మీటర్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించాలని సవాల్ చెశారు. తెలంగాణ వ్యాప్తంగా రేపు జరిగే ధర్నా కార్యక్రమానికి పెద్ద ఎత్తున రైతులను సమీకరించి మండల జిల్లా కేంద్రాలలో నిరసన తెలుపడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను ఎండగట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.