ఎవరూ ఆకలితో పస్తులుండొద్దు : మంత్రి శ్రీనివాస్‌ గౌడ్

by Shyam |
ఎవరూ ఆకలితో పస్తులుండొద్దు : మంత్రి శ్రీనివాస్‌ గౌడ్
X

దిశ, న్యూస్‌బ్యూరో: లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలెవరూ ఆకలితో పస్తులుండకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. పర్యాటక శాఖ ఉద్యోగుల ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు సిటీ పరిసర ప్రాంతాల్లో ఉన్న నిరుపేదలకు ఆహార ప్యాకెట్లను పంపిణీ చేసేందుకు గాను రవాణా వాహనాలను శుక్రవారం మంత్రుల నివాస ప్రాంగణం నుంచి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు లాక్‌డౌన్‌లో సామాన్య ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రజల వద్దకు నేరుగా సరుకులు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. తెలంగాణకు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలను ఆదుకుంటున్నామన్నారు. వలస కూలీల కోసం దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ ప్రభుత్వం సాయపడుతోందని.. రాష్ట్రంలో రెండు, మూడు రాష్ట్రాలకు సరిపడేవిధంగా ఆహార పదార్థాల ఉత్పత్తి జరిగిందన్నారు. లాక్‌డౌన్ పీరియడ్‌లో సామాన్య ప్రజలకు నిత్యావసరాలు అందించేందుకు దాతలు, ఎన్జీవోలు ముందుకు రావాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు.

Tags :Lockdown, Minister Srinivas Goud, Food vehicles, NGOs

Advertisement

Next Story