- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దేశంలో బీజేపీ అధికారంలో ఉంది.. రాష్ట్రంలో బీజేపీ లేదు: మంత్రి బొత్స సత్యనారాయణ
దిశ, ఏపీ బ్యూరో: విజయవాడలో బీజేపీ నిర్వహిస్తున్న ప్రజాగ్రహ సభపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సెటైర్లు వేశారు. దేశంలో బీజేపీ అధికారంలో ఉంది కానీ రాష్ట్రంలో ఆ పార్టీ లేదని ఎద్దేవా చేశారు. ఉనికి కోసమే బీజేపీ విజయవాడలో బహిరంగ సభ నిర్వహిస్తోందని విమర్శించారు. రాజకీయ పార్టీ కాబట్టి బహిరంగ సభ నిర్వహించుకుంటోందని అందులో తప్పేముందన్నారు. రాష్ట్రంలో మేము కూడా ఉన్నామని చెప్పుకోవడానికి బీజేపీ తాపత్రయపడుతుందని.. అందులో భాగమే ఈ ప్రజాగ్రహ సభ అని చెప్పుకొచ్చారు. ఈ ప్రజాగ్రహ సభతో ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా అని నిలదీశారు. గత నాలుగు రోజులుగా బీజేపీ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆధ్వర్యంలోనే నీతి ఆయోగ్ రాష్ట్రాలకి ర్యాంకులు ఇచ్చిందని.. బీజేపీ పరిపాలిస్తున్న ఉత్తరప్రదేశ్ ఏ ర్యాంకులో ఉంది. మన రాష్ట్రం ఏ ర్యాంకులో ఉందో చూశామన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రం ఎందుకు వెనుకబాటులో ఉందో ముందు దానికి సమాధానం చెప్పాలని మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు.