- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఎన్ని కుట్రలు చేసినా ధర్మమే గెలిచింది’
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ మూడు రాజధానుల అంశంపై గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. గవర్నర్ ఆమోదంపై హర్షం వ్యక్తం చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ.. మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీలో ఈ రోజు చారిత్రాత్మకమైన రోజు అని అభివర్ణించారు. మూడు రాజధానుల బిల్లు ఆమోదాన్ని అందరూ స్వాగతిస్తున్నారని తెలిపారు. గవర్నర్ నిర్ణయంతో రాష్ట్రానికి మంచి జరుగుతుందని ఆయన ఆకాంక్షించారు.
అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. మండలిలో టీడీపీకి సంఖ్యాబలం ఉందని ఇష్టమొచ్చినట్లు వ్యవహరించారని మండిపడ్డారు. వీధి రౌడీల్లా శాసన మండలిలో అడ్డుకున్నారన్నారు. టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా.. చివరకు ధర్మమే గెలిచిందని బొత్స వ్యాఖ్యానించారు. త్వరలోనే పరిపాలన రాజధానికి సీఎం జగన్ శంకుస్థాపన చేస్తారని తెలియజేశారు. పరిపాలన వికేంద్రీకరణతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని చెప్పారు. అలాగే, అమరావతి కూడా రాష్ట్రంలో అంతర్భాగమేనని బొత్స ఈ సందర్భంగా గుర్తు చేశారు.