వారు మీ పార్టీకి చెందిన వారా.. కాదా?: బొత్స

by srinivas |
వారు మీ పార్టీకి చెందిన వారా.. కాదా?: బొత్స
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌పై బీజేపీ చీఫ్ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. సోమువీర్రాజు బాధ్యతగా ప్రవర్తించాలని, డీజీపీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని విమర్శించారు. ఆలయాలపై దాడులకు పాల్పడిన టీడీపీ, బీజేపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారని.. అయితే నిందితులు మీ పార్టీకి చెందిన వారా.. కాదా అన్నది స్పష్టం చేయాల్సిన అవసరం మీపైనే ఉందన్నారు. ముందుగా దీనిపై స్పష్టత ఇవ్వకుండా డీజీపీని టార్గెట్ చేస్తే ఏం ప్రయోజనం ఉంటుందన్నారు. సీఎం జగన్‌కు మంచి పేరు రాకూడదనే మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్న మంత్రి బొత్స.. చంద్రబాబు కుట్ర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆలయాలపై దాడుల విషయంలో నిష్పక్షపాతంగా విచారణ జరుగుతోందని, దోషులు ఎంతటి వారైనా కఠిన శిక్ష తప్పదని హెచ్చరించారు.

Advertisement

Next Story