చంద్రబాబు తప్పులే శాపంగా మారాయి

by srinivas |
anilkumar yadav minister ap
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… పోలవరం విషయంలో తప్పులు చేసింది ఎవరో రాష్ట్ర ప్రజలకు తెలియాలని ఆయన వ్యాఖ్యానించారు. ప్యాకేజీల కోసమే చంద్రబాబు పోలవరం నిర్మాణ బాధ్యతలను కేంద్రం నుంచి తీసుకున్నారని విమర్శించారు. 2014 తర్వాత పెరిగిన అంచనాలను చెల్లించమని కేంద్రం చెబితే టీడీపీ ప్రభుత్వం వ్యతిరేకించకుండా, ఇప్పుడు తమపై ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. గతంలో చంద్రబాబు చేసిన తప్పులు ప్రస్తుతం రాష్ట్రానికి శాపంగా మారాయని వెల్లడించారు.

Advertisement

Next Story