‘నువ్వు మగాడివైతే చిటికేసి చూడు’.. లోకేశ్‌పై మంత్రి అనిల్ ఫైర్

by srinivas |   ( Updated:2021-06-20 04:53:18.0  )
‘నువ్వు మగాడివైతే చిటికేసి చూడు’.. లోకేశ్‌పై మంత్రి అనిల్ ఫైర్
X

దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌పై దురుసుగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇంకో నెలలో ఎమ్మెల్సీ ఉంది ఆ తర్వాత కనీసం సర్పంచ్‌గా కూడా గెలవలేవు అని విమర్శించారు. ఇంట్లో కూర్చుని ఐదో తరగతి పిల్లవాడు మాట్లాడుతాడు. దమ్ముంటే బయటికి రా అని సవాల్ విసిరారు.

తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే తట్టుకోలేకపోయారు ఇప్పుడు ఏం పీకతారని విరుచుకుపడ్డారు. ‘‘ నువ్వు చిటికేస్తే వైసీపీ నాయకులు రాష్ట్రంలో తిరగలేరా.. నువ్వు మగాడివైతే చిటికేసి చూడు. ఈ రాష్ట్రంలో ఏమూలకైనా వస్తా! వైసీపీ కార్యకర్తలపై చెయ్యి వేస్తే అప్పుడు చూపిస్తానంటూ ఘాటుగా హెచ్చరించారు. సీఎం వైఎస్‌ జగన్‌ పాలనలో తాము మంత్రులం మాత్రమేకాదని ఆయన అభిమానులమని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రిపై అవాకులు పేలితే సహించేది లేదని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హెచ్చరించారు.

Advertisement

Next Story