- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సదర్మాట్ బ్యారేజీ పనులు వేగవంతం
దిశ, ఆదిలాబాద్: కాళేశ్వరం ప్రాజెక్ట్ 27, 28వ ప్యాకేజీ పనులు, సదర్మాట్ బ్యారేజీ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నిర్మల్ కలెక్టరేట్‌లో శనివారం ఇరిగేషన్ ఇంజనీర్లు, కాంట్రాక్టర్లతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సీఎంవో ఓఎస్డీతో కలసి సమావేశం అయ్యారు. కాలువల నిర్మాణం, బ్యారేజ్ నిర్మాణాలకు కావలసిన నిధుల కోసం సమగ్ర నివేదికను తయారు చేయాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు 27వ ప్యాకేజీ ద్వారా నిర్మల్ నియోజకవర్గంలోని 50 వేల ఎకరాలకు, 28వ ప్యాకేజీ ద్వారా ముధోల్ నియోజకవర్గంలో 50 వేల ఎకరాలకు, సదర్మాట్ బ్యారేజీ ద్వారా 15 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించవచ్చని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎస్డీ శ్రీధర్‌దేశ్ పాండే మాట్లాడుతూ.. 27, 28వ ప్యాకేజీ పనులకు, సదర్మాట్ బ్యారేజీ నిర్మాణ పనులకు నిధుల మంజూరుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ శంకర్ గౌడ్ మాట్లాడుతూ.. 27వ ప్యాకేజీలో రూ.256.58 కోట్ల పనులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. సదర్మాట్ బ్యారేజీ కోసం ఇప్పటివరకు రూ.195.33 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఇంకా 212.78 కోట్ల రూపాయల బ్యాలెన్స్ పనులు చేపట్టాల్సి ఉందన్నారు. సమావేశంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కొరిపెల్లి విజయలక్ష్మి, జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ, జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, ముధోల్, ఖానాపూర్ ఎమ్మెల్యేలు విట్టల్ రెడ్డి, రేఖా నాయక్, రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ నల్ల వెంకట్రామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.