మహిళల ఆత్మాభిమానానికి పెద్దపీట వేశాం

by Aamani |
మహిళల ఆత్మాభిమానానికి పెద్దపీట వేశాం
X

దిశప్రతినిధి,హైదరాబాద్, ఆదిలాబాద్:
మహిళల ఆత్మాభిమానానికి పెద్దపీట వేశామని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ రూరల్ మండలం ముజిగి గ్రామంలో మహిళలకు బతుకమ్మ చీరలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ఆడబిడ్డలకు కానుకగా ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ చీరలను అందజేస్తున్నారని తెలిపారు. కరోనా కష్ట కాలంలోనూ ప్రభుత్వం రూ.317 కోట్లతో బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తోందని అన్నారు. ముజిగి గ్రామంలో రామాలయనికి 50 లక్షలు, మల్లన్న ఆలయానికి, కోనేరు కు 10 లక్షల నిధులు మంజూరుకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.

సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సీలాల్ పేట మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్, అమీర్ పేట లోని వివేకానంద నగర్ కమిటీ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నియోజకవర్గ పరిధిలోని 6 డివిజన్లలో సుమారు 45 వేల చీరలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. బతుకమ్మ పండుగ ఒక్కటే కాకుండా అన్ని పండుగలను ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా, సంతోషంగా జరుపుకుంటున్నట్లు చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed