- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘ఈ స్కీమ్‌తో దళారులు లేకుండా మత్స్యకారులకు ప్రయోజనం’
దిశ, సారంగాపూర్: మత్స్యకారుల అభివృద్ధి కోసమే ఉచితంగా వంద శాతం సబ్సిడీతో చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆదివారం సారంగాపూర్ మండలంలోని స్వర్ణ ప్రాజెక్ట్ వాటర్‌లో చేప పిల్లలను ఆయన వదిలారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. గ్రామాల్లోని మత్స్యకారుల కుటుంబాలు ఆర్థికంగా మెరుగుపడాలి.. దళారుల ప్రమేయం లేకుండా విక్రయాలు చేపట్టి ఆర్థిక ప్రయోజనాలు పొందాలన్నారు. చెరువులు, కుంటలు, రిజర్వాయర్లపై ఆధారపడిన కులస్తులు అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం చేపట్టారన్నారు. ఈ నేపథ్యంలోనే నిర్మల్ జిల్లాలో మత్స్యకారుల భవన నిర్మాణం కోసం రూ. కోటి 50 లక్షలతో పనులు ప్రారంభించామన్నారు. రూ. 50 లక్షలతో ఫిష్ మార్కెట్ అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాంబాబు, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు నల్లా వెంకట్రాంరెడ్డి, మండల ఎంపీపి అట్ల మైపాల్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వంగ రవీందర్ రెడ్డి, అడెల్లి టెంపుల్ చైర్మన్ చందు, పారిశ్రామికవేత్త అల్లోల మురళీధర్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ ఐరన నారాయణ రెడ్డి, మత్స్య శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.