బుల్లెట్‌ బండి నడిపిన మంత్రి అల్లోల

by Aamani |   ( Updated:2021-10-14 04:04:42.0  )
బుల్లెట్‌ బండి నడిపిన మంత్రి అల్లోల
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్వయంగా బుల్లెట్ బండి నడిపారు. ఎ.ఎన్.రెడ్డి కాలనీలోని రాయల్ ఎన్‌ఫీల్డ్ షోరూంకు వెళ్లి మంత్రి బైక్ కొనుగోలు చేశారు. అనంతరం షోరూం నుంచి ఇంటి వరకు బైక్ నడిపారు. ఈ క్రమంలోనే ఇంటి వద్ద వాహన పూజ చేశారు.

జమ్మి మొక్కను నాటిన మంత్రి..

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా “ఊరు ఊరికో జమ్మి చెట్టు.. గుడి గుడికో జమ్మి చెట్టు” కార్యక్రమంలో మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి పాల్గొని, దేవరకోట శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం, నందిగుండం సాయి బాబా ఆలయ ప్రాంగణంలో జమ్మి మొక్కను నాటారు.

Advertisement

Next Story