తిరుపతి ప్రమాదంపై మంత్రి ఆళ్లనాని సీరియస్..

by srinivas |
తిరుపతి ప్రమాదంపై మంత్రి ఆళ్లనాని సీరియస్..
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలోని పద్మావతి కొవిడ్ సెంటర్‌లో జరిగిన ప్రమాదంపై మంత్రి ఆళ్లనాని సీరియస్ అయ్యారు. స్విమ్స్ డైరెక్టర్ వెంగమ్మను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాంట్రాక్టు ఉద్యోగి రాధిక మృతిపై మంత్రి విచారం వ్యక్తం చేయడమే కాకుండా, ఆమె కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని భరోసానిచ్చారు.

అయితే, ఈ ప్రమాదంపై నివేదిక ఇవ్వాలని ఇంజినీర్లను ఆళ్లనాని ఆదేశించారు. కాగా, కొత్తగా నిర్మించిన కొవిడ్ సెంటర్ భవనం పైకప్పు పెచ్చులు ఊడి మీద పడటంతో అటెండర్ రాధిక మృతి చెందగా, మరో ఇద్దరు కొవిడ్ రోగులు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story