- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చంద్రబాబు ఓర్వడం లేదు: ఆళ్ల నాని
దిశ, వెబ్ డెస్క్: ఏపీ మంత్రి ఆళ్ల నాని మరోసారి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ అత్యంత సమర్థవంతంగా పాలన చేస్తున్నారని, చంద్రబాబు పైశాచిక ఆనందంలో ఉన్నారన్నారు. చంద్రబాబు ప్రజలను భయబ్రాంతులకు గురిచేసే పనిలో ఉన్నారని, విపత్కర పరిస్థితుల్లో కూడా చంద్రబాబు బాధ్యాతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు ఆరాటపడుతున్నారని, చంద్రబాబు హయంలో జిల్లా ఆస్పత్రులను గాలికొదిలేశారని ఆరోపించారు.
గతంలో 104, 108 వ్యవస్థలను నిర్వీర్యం చేశారని, అదేవిధంగా ఆరోగ్యశ్రీని నిలిపివేసి పేదలను బలిగొన్నారన్నారు. బాబు బాధ్యతగా లేకపోతే తర్వాత ప్రతిపక్ష హోదా కూడా దక్కదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాలకు అడ్డుతగిలితే సహించబోమని హెచ్చరించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 16 లక్షల 43 వేల 319 మందికి కరోనా టెస్టులు చేశామని, ఇప్పటి వరకు సంపూర్ణ ఆరోగ్యంతో 46,301 మందికి చికిత్స అందించి ఇంటికి పంపినట్లు మంత్రి పేర్కొన్నారు.
ప్రతి రోజూ 50 వేల టెస్టులు చేసే సామర్థ్యాన్ని పెంచుతున్నామని, కేవలం ప్రతి రోజు టెస్టుల కోసమే రూ.5 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు. టెస్టుల సామర్థ్యం బట్టే కేసులు పెరుగుతున్నాయన్నారు. ప్రతి జిల్లాకు కాల్ సెంటర్ ఏర్పాటు చేసి ప్రజల ఇబ్బందులను తెలుసుకుంటున్నామని మంత్రి తెలియజేశారు. రాష్ట్రంలో కోవిడ్ ఆస్పత్రులను 138కి పెంచామని, కోవిడ్ ఆస్పత్రుల్లో బెడ్లు, వెంటిలేటర్లు, పీపీఈ కిట్లు అధికంగా ఏర్పాటు చేస్తున్నట్లు నాని తెలిపారు.