గులాబీ రంగులోనే బ‌యో టాయిలెట్స్

by Sridhar Babu |   ( Updated:2020-07-22 09:31:54.0  )
గులాబీ రంగులోనే బ‌యో టాయిలెట్స్
X

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ఉమెన్ బయో-టాయిలెట్స్ బస్సులు గులాబీ రంగులోనే ఉండాలన్న మంత్రి కేటీఆర్ సూచనల మేరకు బస్సుల రంగు మార్చామని, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయా బస్సులను బుధవారం ఖ‌మ్మంలోని ఎస్సార్ బీజీఎన్ ఆర్ క‌ళాశాల మైదానంలో బ‌స్సుల‌ను అందుబాటులో ఉంచారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో ‘టాయిలెట్‌ ఆన్‌ వీల్స్‌’ ను సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో మేయర్ పాపాలాల్ గారు, జిల్లా కలెక్టర్ కర్ణన్, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ ఉన్నారు.

Advertisement

Next Story