‘డిమాండ్ ఉన్న పంటలు వేయాలి’

by Sridhar Babu |
‘డిమాండ్ ఉన్న పంటలు వేయాలి’
X

దిశ‌,ఖ‌మ్మం: ప్రభుత్వ సూచనల మేరకు గ్రామ‌ వ్యవసాయ ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులను రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆదేశించారు. సోమవారం ఖమ్మం పట్టణంలోని టీటీడీసీ భవన్‌లో నిర్వహించిన ‘‘వానాకాలం 2020 సాగు ప్రణాళిక – నియంత్రిత వ్యవసాయ సాగు విధానం’’ సదస్సులో మంత్రి పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ.. గ్రామాల్లోని రైతుల వద్దకు ప్రతిరోజు వ్యవసాయ విస్తరణాధికారులు వెళ్లి అవ‌గాహ‌న క‌ల్పించాల‌న్నారు. మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా రైతులు పంటలు పండించాలన్నారు.

ఖమ్మం జిల్లాలో వరి పంట 2,30,000 ఎకరాలు, కంది 10,000 ఎకరాలు, పెసర 22,000 ఎకరాలు, మినుముల 320 ఎకరాలు, వేరుశెనగ 850 ఎకరాలు, మిర్చి-51,150, జొన్నలు-100 ఎకరాలు.. ఇలా మొత్తంగా 3,14,420 ఎకరాల్లో సాగు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి వివరించారు. కార్యక్రమంలో ఎంపీ నామా నాగేశ్వ‌ర్‌రావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్మన్ లింగాల కమలరాజ్, జిల్లా కలెక్టర్ ఆర్‌వీ క‌ర్ణ‌న్‌, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, జిల్లా రైతు బంధు కన్వీనర్ నల్లమల వెంకటేశ్వర రావు , ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, రాములు నాయక్, కందాల ఉపేందర్ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed