‘రైతుల సంక్షేమ‌మే ప్ర‌భుత్వ‌ ధ్యేయం’

by Sridhar Babu |   ( Updated:2020-04-04 04:27:28.0  )
‘రైతుల సంక్షేమ‌మే ప్ర‌భుత్వ‌ ధ్యేయం’
X

దిశ‌, ఖ‌మ్మం: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, అందుకే ప్రస్తుత క్లిష్ట ప‌రిస్థితుల్లో వారు నష్టపోకూడదనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ధాన్యం, మొక్క‌జొన్న కేంద్రాల‌ను ఏర్పాటు చేయించారని మంత్రి అజ‌య్ కుమార్ తెలిపారు. ముదిగొండ మండలంలోని పలు గ్రామాల్లో ఈ కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం ఆయన ఖమ్మంలోని 26వ డివిజన్ కార్పొరేటర్ పగడాల నగరాజ్ ఆధ్వర్యంలో పేదలు, వితంతువుల కుటుంబాలకు నిత్యావసర సరుకులు, మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో కలెక్టర్ ఆర్‌.వి. కర్ణన్, అదనపు కలెక్టర్ మధుసూదన్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, డిప్యూటీ మేయర్ బత్తుల మురళి, ఏడీ విజయనిర్మల తదితరులు పాల్గొన్నారు.

Tags: khammam, mudigonda, puvvada, cm, cropsoldcentres, collectorkarnan, DCCB chairman

Advertisement

Next Story

Most Viewed