ఆఫ్ఘాన్ పై ఏం చేయబోతున్నారు..? : అసదుద్దీన్

by Shamantha N |   ( Updated:2021-08-17 06:57:15.0  )
asaduddin-owasi
X

దిశ, వెబ్‌డెస్క్ : ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని తాలిబన్లు పూర్తిగా ఆక్రమించుకున్న నేపథ్యంలో అక్కడి పౌరులు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు ఇతర దేశాలకు వలస పోతున్నారు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ లో నెలకొన్న పరిస్థితులను, అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రపంచం నిశితంగా గమనిస్తోంది. ఈ క్రమంలోనే ఆఫ్ఘాన్ పై భారత ప్రభుత్వం వైఖరి ఎంటో చెప్పాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆ దేశంలో భారత్ ఇప్పటికే మూడు బిలియన్ డాలర్లు ఖర్చు చేసిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆఫ్ఘాన్ పార్లమెంట్, సలామా బ్రిడ్జి నిర్మాణాలను భారత ప్రభుత్వమే నిర్మించింది. ఉగ్రవాద సంస్థలు ఉన్నచోట భారత్ ఎందుకు అంత ప్రాధాన్యం ఇచ్చిందని ఓవైసీ ప్రశ్నించారు. ఈ విషయంపై వెంటనే కేంద్రం తన వైఖరిని తెలపాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story