ఎంఐఎం ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం

by Aamani |
ఎంఐఎం ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం
X

దిశ, నిజామాబాద్: మహారాష్ట్రలోని ఔరంగబాద్‌కు చెందిన ఎంఐఎం ఎమ్మెల్యే వారిస్ పఠాన్ దిష్టిబొమ్మను నిజామాబాద్‌‌ నిఖిల్ సాయి చౌరస్తా వద్ద బీజేపీ నగర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం దహనం చేశారు. తమ 15 కోట్ల జనాభా 100కోట్ల మందికి సమానమంటూ పఠాన్ ఇటీవలే వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలకు నిరసనగానే పఠాన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశామని బీజేపి నగర అధ్యక్షులు యెండల సుధాకర్ తెలిపారు. అలాగే, పఠాన్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read also..

నేచురోపతికి పూర్వ వైభవం: ఈటల

Advertisement

Next Story