ఈశాన్యంలో రక్షణ బలగాలకు కరోనా

by Shamantha N |
ఈశాన్యంలో రక్షణ బలగాలకు కరోనా
X

గువహతి: అసోం మినహా ఈశాన్య రాష్ట్రాలన్నింటిలో కరోనా పాజిటివ్ కేసుల్లో చాలా వరకు రక్షణ సిబ్బందే ఉన్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని మొత్తం 637 యాక్టివ్ కేసుల్లో 337 మంది(52.9శాతం) ఆర్మీ, సీఆర్‌పీఎఫ్, (CRPF) బీఎస్ఎఫ్ (BSF), ఇతర రక్షణ సిబ్బందే ఉన్నారు. మిజోరంలోనూ 326 యాక్టివ్ కేసుల్లో 201 మంది(61.7శాతం), మేఘాలయాలో 626 కరోనా యాక్టివ్‌గా ఉన్నవారిలో 255 మంది(40.7శాతం) రక్షణ బలగాలకు చెందినవారే.

నాగాలాండ్‌లో నమోదైన మొత్తం 3011 కరోనా కేసుల్లో 1372(45.6శాతం) మంది రక్షణ బలగాలకు చెందినవారే కావడం గమనార్హం. త్రిపురలో 720 మంది బీఎస్ఎఫ్(BSF) సిబ్బందికి కరోనా సోకింది. మణిపూర్‌లో సోమవారం కొత్తగా కరోనా సోకిన 57 మందిలో 43 మంది కేంద్ర రక్షణ బలగాలకు చెందినవారే. ఇక్కడ మొత్తం 1720 యాక్టివ్ కేసుల్లో 726(42.2శాతం) కేంద్ర రక్షణ బలగాల సిబ్బందే ఉన్నారు. మిజోరం, మేఘాలయ, నాగాలాండ్ సహా మరికొన్ని ఈశాన్య రాష్ట్రాలు రక్షణ బలగాల కదలికలపై ఆంక్షలు విధిస్తున్నాయి. సెలవుల నుంచి తిరిగి వచ్చినవారిని, వేరే రాష్ట్రాల నుంచి వచ్చే బలగాలపై కరోనా టెస్టులు నిర్వహిస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed