హోం క్వారంటైన్‌లో బాలీవుడ్ నటుడి హోలీ వేడుకలు

by Shyam |
Milind Soman
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటుడు మిలింద్ సోమన్ కొన్ని రోజుల క్రితం కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ప్రస్తుతం తను హోం క్వారంటైన్‌లో ఉన్నాడు. అయితే భర్తను అతిగా ప్రేమించే మిలింద్ భార్య హోలి రోజున ఎలాంటి సర్‌ప్రైజ్ ఇచ్చిందో తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. పీపీఈ కిట్‌లో సీజనల్ ఫస్ట్ మామిడి పండ్లతో తన రూమ్‌లోకి ప్రవేశించిందని..కానీ ఎలాంటి కౌగిలింత లేకుండానే ఎవరి మీద వారు కలర్స్ చల్లుకున్నామని తెలిపాడు.

ఆరు డెలీషియస్ మామిడి పండ్లను తిన్నానని తెలిపిన మిలింద్..టేస్ట్ బడ్స్ పెరిగి ఉండొచ్చని చెప్పాడు. స్మెల్ రావడం లేదని వివరించాడు. మేతి, ఇతర స్టఫ్‌తో కూడిన ట్రెడిషనల్ హోం రెమెడీ ‘కద’ రోజుకు 5-6 సార్లు తీసుకుంటున్నానని, తలనొప్పి, జలుబు, జ్వరంతో పాటు ఇతర ఏ సింప్టమ్స్ కూడా లేవని చెప్పాడు. కొవిడ్ నుంచి త్వరగా కోలుకునేందుకు ఈ సమయంలో మెంటల్, ఫిజికల్ రెస్ట్ చాలా అవసరం కాబట్టి రోజు మొత్తం పడుకునేందుకు ప్రయత్నిస్తున్నానని తెలిపాడు మిలింద్.

Advertisement

Next Story